Header Banner

పహల్గాం దాడి ఎఫెక్ట్.. పాకిస్థాన్‌పై భారత్ 5 కీలక నిర్ణయాలివే!

  Wed Apr 23, 2025 22:14        Politics

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై చేపట్టిన దర్యాప్తులో ఈ దాడి వెనుక బాహ్య శక్తుల హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ వాటర్ ట్రీటీ) తక్షణమే నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

 

ఇది కూడా చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. వీసా రద్దుపై కోర్టు కీలక ప్రకటన! 50 శాతం మంది భారతీయులే..

 

జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలను ఈ కమిటీయే తీసుకుంటుంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించారు. అలాగే అటారీ - వాఘా చెక్ పోస్టును కూడా వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu